హైదరాబాద్, 8 సెప్టెంబర్ (హి.స.)
ఆసియా కప్ 2025 రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. 20 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. యూఏఈ, హాంగ్ కాంగ్, ఒమన్ సంచలనాలు సృష్టించేందుకు సై అంటున్నాయి. తొలిసారి ఆసియా కప్ లో 8 జట్లు ఆడుతుండడంతో ఈ టోర్నీ ఆసక్తిగా మారింది. దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణగా మారనుంది. మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ .. గ్రూప్ –బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్ గా 19 మ్యాచ్ లు జరుగుతాయి. టీ20 ఫార్మాట్ లో జరగనున్న టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది. . ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్లో జరుగుతుంది. సూపర్ 4 సెప్టెంబర్ 20 నుండి 26 వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 28న జరగనున్న టోర్నమెంట్ ఫైనల్కు దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..