పనితీరును బట్టే పదవులుండాలి.. అధ్యక్ష పదవిపై ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు
హైదరాబాద్, 8 సెప్టెంబర్ (హి.స.) బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన అర్వింద్.. నేను అహంకారిని అనే ఆరోపిస్తుంటారు. నేను పార్టీలో చేరి 8 ఏళ్లు అయింది. ఎవరిపై అహంకార
ఎంపీ అరవిందు


హైదరాబాద్, 8 సెప్టెంబర్ (హి.స.)

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన అర్వింద్.. నేను అహంకారిని అనే ఆరోపిస్తుంటారు. నేను పార్టీలో చేరి 8 ఏళ్లు అయింది. ఎవరిపై అహంకారంతో ఉన్నాను? దీనికి జవాబు ఉండదన్నారు. పనితీరును బట్టి పదవులు ఇవ్వాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం అని బీజేపీ డిక్లేర్ చేసింది. ఈ విషయంపై నన్ను హైకమాండ్ అడింగింది. అందుకు తాను బీసీ సీఎం ఎందుకు డిక్లేర్ చేశారో మీకు తెలుసు. కానీ కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి సీనియర్ రెడ్డి నేతలు ఎవరూ అసెంబ్లీకి పోటీ చేయకపోతే బీసీ సీఎం డిక్లరేషన్ కు విలువ ఎక్కడుంటుంది అని నేను హైకమాండ్ ను అడిగానన్నారు. ప్రజల ముందు ఒక సందేశాన్ని పెట్టినప్పుడు అందుకు తగిన వ్యవహారం కూడా ఉండాలని హాట్ కామెంట్స్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande