ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం: ఎంపీ సురేశ్ రెడ్డి
న్యూఢిల్లీ, 8 సెప్టెంబర్ (హి.స.) రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగుకు దూరంగా ఉండనున్నట్లు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని విధాలుగా ఆలోచనలు వేసి, ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు
బీఆర్ఎస్


న్యూఢిల్లీ, 8 సెప్టెంబర్ (హి.స.) రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగుకు దూరంగా ఉండనున్నట్లు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని విధాలుగా ఆలోచనలు వేసి, ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రైతులు తీవ్ర సంక్షోభపరిస్థితుల్లో ఉన్నారని, యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, యురియా కొరతను తీర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశామని, తాము రిక్వెస్ట్ చేసినా.. రెండు ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనట్లు సురేశ్ రెడ్డి అన్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నిక బ్యాలెట్పై నోటా అందుబాటులో లేదు కాబట్టి ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ఎంపీ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande