, ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్.ల బదిలీలు చేస్తూ.ప్రభుత్వం .ఉత్తర్వులు జారీ
అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేశారు. బాగా పని చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్
Cbn


అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేశారు. బాగా పని చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు తితిదే ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. అంతేకాకుండా.. రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, రెవెన్యూ, కెక్సైజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ముఖేశ్‌కుమార్‌ మీనా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్‌ శ్రీధర్‌, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్‌ దండేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande