హైదరాబాద్, 8 సెప్టెంబర్ (హి.స.)
ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రప్రభుత్వాని దేనన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని ఉద్దేశపూర్వకంగానే బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై ఈ రకంగా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందననేది వాస్తవం అని, ఎరువుల బాధ్యత వహించాల్సిన వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని దుయ్యబట్టారు. క్షేత్ర స్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు