అందరి సహకారం వల్లనే మక్తల్ అభివృద్ధిలో దూసుకెళ్తుంది : మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణ, నారాయణపేట. 8 సెప్టెంబర్ (హి.స.) నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి అన్ని విభాగాల అధికారులు శక్తి వంచన లేకుండా పనిచేయడం వల్ల ఒడిదుడుకులు లేకుండా, నిర్విరామ కృషితో అభివృద్ధి చెందుతోందని మంత్రి వాకిటి శ్రీహర
మంత్రి వాకిటి శ్రీహరి


తెలంగాణ, నారాయణపేట. 8 సెప్టెంబర్ (హి.స.)

నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో జరిగే ప్రతి

కార్యక్రమానికి అన్ని విభాగాల అధికారులు శక్తి వంచన లేకుండా పనిచేయడం వల్ల ఒడిదుడుకులు లేకుండా, నిర్విరామ కృషితో అభివృద్ధి చెందుతోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నిమజ్జన కార్యక్రమంలో పనిచేసిన తాగునీరు, పారిశుద్ధ్యం, మెడికల్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ తదితర విభాగాల దాదాపు వందమంది పైగా సిబ్బందిని మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

ప్రజల నుండి ఎన్నికైనంత మాత్రాన అభివృద్ధి జరగదని, అన్ని విభాగాల అధికారులు తమ తమ విభాగాల్లో శక్తివంచన లేకుండా కృషి చేసినప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారులు చేసిన కృషిని గుర్తించి పైస్థాయి నుండి వారిని ఆప్యాయంగా పలకరించడం, సన్మానించడం వల్ల వారు చేసిన కష్టానికి గౌరవం లభిస్తుందని, అది వారికి ఆనందాన్ని కలిగిస్తుందని మంత్రి శ్రీహరి అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande