వేములవాడ, 8 సెప్టెంబర్ (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లా -వేములవాడ మండలం అగ్రహారం జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు తన సమస్యల పరిష్కారం కోసం రోడ్ ఎక్కారు. కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని వేములవాడ సిరిసిల్ల - రహదారిపై సోమవారం విద్యార్థులు రాస్తారోకో చేట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేఎన్టీయూ కళాశాలలో మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మూడు రోజుల క్రితం విద్యార్థులమంతా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ గోడును కలెక్టర్కు స్వయంగా విన్న వించుకున్నామన్నారు.
సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు ఇలాంటి పురోగతి లేదని వాపోయారు. విద్యార్థులు దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో చేయగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు విద్యార్థులను బలవంతంగా రోడ్డుపై నుంచి పక్కకు తప్పించి కొంత మంది విద్యార్థులను పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు