తెలంగాణ, సంగారెడ్డి. 8 సెప్టెంబర్ (హి.స.)
ప్రజలకు వచ్చే సమస్యలు పెండింగ్ లో
పెట్టకుండా వెంటనే వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 61 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణి కి పింఛన్లు, సంక్షేమ పథకాలు, భూ వివాదాలు, ఆరోగ్యం, విద్య, తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలు తమ సమస్యలకు అధికారుల నుంచి స్పందన లభించడం తో సంతృప్తి వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు