ఏపీలో యూరియా కొరత.. మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ
శ్రీకాకుళం, 8 సెప్టెంబర్ (హి.స.) యూరియా కొరతపై అన్నదాతలు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. ఇవాళ(
ఏపీలో యూరియా కొరత.. మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ


శ్రీకాకుళం, 8 సెప్టెంబర్ (హి.స.) యూరియా కొరతపై అన్నదాతలు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) శ్రీకాకుళం రూరల్ మండలం తండెంవలస గ్రామంలో ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే, యూరియా పంపిణీ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

రైతులు ఏడాది అంతటికి ఒకేసారి నిల్వ చేసుకోవాలనే ఆలోచనతోనే యూరియా సమస్య తలెత్తిందని చెప్పుకొచ్చారు. ఎకరాకు 25 కేజీల యూరియా (Urea Shortage) వాడాలని సూచించారు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 25 కేజీల చొప్పున మూడు విడుతలుగా రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఇది వ్యవసాయ శాస్త్రజ్ఞుల సూచనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. దేశంలో దీనికి సంబంధించిన సర్వేలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఆలోచనలు చేశాయని వివరించారు మంత్రి అచ్చెన్నాయుడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande