హైదరాబాద్, 8 సెప్టెంబర్ (హి.స.)
త్రిపుల్ ఆర్ అలైన్మెంట్ తక్షణమే
ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు అమీర్పేట స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. త్రిపుల్ ఆర్ వద్దురా వ్యవసాయ భూములే ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి, గజ్వేల్, బోనగిరి, వలిగొండ, సంస్థాన్ నారాయణపూర్, గట్టుప్పల్, మండల, డివిజన్ పరిధిలోని బాధితులు వందల మంది రైతులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోని హెచ్ఎండిఏ కార్యాలయంకి చేరుకొని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. చౌటుప్పల్, బోనగిరి, గజ్వేల్, సంగారెడ్డి పట్టణ ప్రాంత రైతులు ఎక్కువ మొత్తంలో విలువైన భూములను కోల్పోతున్నామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..