అల్లు అర్జున్ ఇంటికి మహేశ్ కుమార్ గౌడ్.. కుటుంబ సభ్యులకు పరామర్శ..
హైదరాబాద్, 8 సెప్టెంబర్ (హి.స.) ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మరియు నటుడు అల్లు అర్జున్ లను తెలంగాణ పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పరామర్శించారు. సోమవారం జూబ్లీహిల్స్లోని వారి నివాసానికి వెళ్లి కలిశారు . ఇటీవలే ప్రఖ్యాత హాస్యనటుడు
మహేష్ కుమార్ గౌడ్


హైదరాబాద్, 8 సెప్టెంబర్ (హి.స.)

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మరియు నటుడు అల్లు అర్జున్ లను తెలంగాణ పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పరామర్శించారు. సోమవారం జూబ్లీహిల్స్లోని వారి నివాసానికి వెళ్లి కలిశారు . ఇటీవలే ప్రఖ్యాత హాస్యనటుడు, పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఇప్పటికే వారి కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతిని తెలియజేశారు. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన దేవుడిని ప్రార్థించారు. ఈ దుఃఖ సమయంలో వారికి తోడుగా నిలవాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. . ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande