దీపావళికి పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు..
న్యూఢిల్లీ, 8 సెప్టెంబర్ (హి.స.) వందే భారత్ స్లీపర్ రైలు దీపావళికి పట్టాలెక్కబోతుంది. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వందే భారత్ స్లిపర్ రైలును దీపావళికి ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోన
వందే భారత్


న్యూఢిల్లీ, 8 సెప్టెంబర్ (హి.స.)

వందే భారత్ స్లీపర్ రైలు దీపావళికి పట్టాలెక్కబోతుంది. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వందే భారత్ స్లిపర్ రైలును దీపావళికి ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పైగా దీపావళి పండుగకు పెద్ద ఎత్తున బీహారీయులు తరలివెళ్తారు. ఇంకోవైపు నవంబర్ లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళికి ఢిల్లీ-పాట్నా రూట్లో వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande