అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.)ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో అరెస్టైన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy Bail) ఇటీవల మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి ఈనెల 11న రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఆయన తరఫు లాయర్ ఏసీబీ కోర్టులో (ACB Court) వాదనలు వినిపించారు. దీనిపై తదుపరి విచారణను కోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. అలాగే చాణక్య బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.
మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఏ31, ఏ 32, ఏ33గా ఉన్న నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయగా.. ముగ్గురు నిన్న (సెప్టెంబర్ 7) జైలు నుంచి విడుదలయ్యారు. వారి బెయిల్ పై స్టే ఇవ్వాలని కోరుతూ సిట్ హైకోర్టులో (AP High Court) పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై హైకోర్టులో విచారించింది. అలాగే డీఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై బెయిల్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని సిట్ మరో పిటిషన్ కూడా దాఖలు చేసింది. రెండు పిటిషన్లను విచారించిన బెయిల్ పై విడుదలైన వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో మిగతా నిందితులకు కూడా బెయిల్ ఇవ్వొద్దని సిట్ కోరగా.. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి