తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో మంత్రి లోకేశ్‌ భేటీ
కోయంబత్తూరు, 8 సెప్టెంబర్ (హి.స.)ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో సోమవారం భేటీ అయ్యారు. కోయంబత్తూరులో వీరిద్దరి మధ్య ఈ మర్యాదపూర్వక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్
అన్నామలైతో మంత్రి లోకేశ్‌ భేటీ


కోయంబత్తూరు, 8 సెప్టెంబర్ (హి.స.)ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో సోమవారం భేటీ అయ్యారు.

కోయంబత్తూరులో వీరిద్దరి మధ్య ఈ మర్యాదపూర్వక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అన్నామలైకి లోకేశ్ వివరించారు.

కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండటం వల్ల (డబుల్ ఇంజన్ సర్కార్) ఏపీ శరవేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల పనితీరును, వాటి ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధిని ఆయన తెలియజేశారు.

ముఖ్యంగా విద్యారంగంలో తాము అమలు చేస్తున్న సంస్కరణలు, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని లోకేశ్ తెలిపారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూడాలని, ఇక్కడి పాలనను పరిశీలించాలని అన్నామలైని ఆయన రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande