
అమరావతి, 12 జనవరి (హి.స.)
రాష్ట్రరాజధాని అమరావతి ప్రాంతంలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈరోజు(సోమవారం) పెదకూరపాడు మండలం కర్లపూడి - లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ(Minister Narayana) ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలను మంత్రి స్వీకరించారు. కాంపిటెంట్ అథారిటీ.. గ్రామంలో 2654 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్‌కు రైతులు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్‌కు ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu), మంత్రి నారాయణకు అన్నదాతలు ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ