బెంగుళూరు విజయవాడ వయా కడప హైవే 4 గిన్నిస్ రికార్డ్
అమరావతి, 12 జనవరి (హి.స.) అమరావతి: బెంగళూరు- విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్‌పథ్‌ ఇన్‌ఫ్రాకాన్‌ గుత్తేదారు సంస్థ నాలుగు గిన్నిస్‌ రికార్డులు సృష్టించింది. సోమవారం వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గిన్నిస్
బెంగుళూరు విజయవాడ వయా కడప హైవే 4 గిన్నిస్ రికార్డ్


అమరావతి, 12 జనవరి (హి.స.)

అమరావతి: బెంగళూరు- విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్‌పథ్‌ ఇన్‌ఫ్రాకాన్‌ గుత్తేదారు సంస్థ నాలుగు గిన్నిస్‌ రికార్డులు సృష్టించింది. సోమవారం వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గిన్నిస్‌ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ రికార్డు నెలకొల్పడాన్ని నితిన్‌ గడ్కరీ, చంద్రబాబు వేర్వేరుగా ప్రశంసించారు.

ఈ నెల 5న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద ఈ ప్రయత్నాలను నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఈ నెల 6 బొంతలపల్లి సమీపంలో 28.89 లేన్‌ కిలోమీటర్ల పొడవైన రహదారిని 24 గంటల్లోపు పూర్తి చేసి మొదటి రికార్డు సృష్టించింది. అలాగే 24 గంటల్లో అత్యధికంగా 10,655 టన్నుల బిటుమినస్‌ కాంక్రీట్‌ను నిరంతరం వేసి రెండో రికార్డు సాధించింది. ఈ నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్‌ కాంక్రీట్‌ను నిరంతరంగా వేసి మూడో రికార్డును, మొత్తం 156 లేన్‌ కిలోమీటర్ల (26 కిలోమీటర్ల మేర 6 వరుసలు) పొడవైన రహదారిని నిరంతరంగా నిర్మించి నాలుగో రికార్డును సృష్టించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande