
అమరావతి, 12 జనవరి (హి.స.)
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. దేవాలయం వెనుక ద్వారం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారం, వెండి నగలు చోరీ చేసినట్లు సోమవారం గుర్తించారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులకు ఆలయ ధర్మకర్త ముకుందపండా సమాచారం ఇచ్చారు. సుమారు రూ.60లక్షల విలువచేసే ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆయన చెబుతున్నారు. ఘటనాస్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్, సీఐ రామకృష్ణ పరిశీలించారు.
ఈ దేవాలయంలో నవంబర్ 1న తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. తొక్కిసలాట అనంతరం పోలీసుల ఆదేశాల మేరకు దేవాలయంలో దర్శనాలు నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ