
తిరుపతి, 12 జనవరి (హి.స.):తిరుపతిలో ) ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని బలిజపల్లిలో మహిళ మృతిచెందింది. మృతురాలిని మల్లేశ్వరి(52)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. నాలుగు రోజుల క్రితమే మల్లేశ్వరి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. కుటుంబంలో మనస్పర్ధల కారణంగా చాలాకాలం నుంచి భర్త, కుమారుడికి దూరంగా ఉంటూ ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ