ఇంద్ర కికాద్రి.పై.వెలసిన కనక దుర్గమ్మ సన్నిధిలో అపచార ఘటన
అమరావతి, 12 జనవరి (హి.స.) ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ సన్నిధిలో( ) అపచారంపై ఆలయ ఈవో శీనా నాయక్ స్పందిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు. అపచార ఘటనపై విచారణకు ఈవో కమిటీని ఏర్పాటుచేసిన
ఇంద్ర కికాద్రి.పై.వెలసిన కనక దుర్గమ్మ సన్నిధిలో అపచార ఘటన


అమరావతి, 12 జనవరి (హి.స.)

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ సన్నిధిలో( ) అపచారంపై ఆలయ ఈవో శీనా నాయక్ స్పందిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు. అపచార ఘటనపై విచారణకు ఈవో కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కమిటీ ఈవోకు నివేదిక అందజేసింది. అమ్మవారికి అభిషేకం కోసం వినియోగించిన పాలలో పురుగులు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ క్రమంలో స్టోర్, పూజా విభాగాల ఉద్యోగులు, అర్చకుడికి మెమోలు జారీ అయ్యాయి. ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఆవుపాలే వినియోగించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande