
హైదరాబాద్, 12 జనవరి (హి.స.) మహనీయులను స్మరించుకోవడం
ప్రతి ఒక్కరి బాధ్యత అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసాపేట్ డివిజన్ మోతీనగర్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సోమవారం నూతనంగా ఏర్పాటు చేసి స్వామి వివేకానంద, భగత్ సింగ్ విగ్రహాలను ఎంపీ ఈటల రాజేందర్ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మానవాళి ఉన్నంత వరకు అందరికి స్ఫూర్తివంతుడు స్వామి వివేకానందుడుని, మరొకరు దేశం కోసం చిన్న వయస్సులో ఉరికంబం ఎక్కి తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు షహీద్ భగత్ సింగ్ అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు