పోలవరం - నల్లమల సాగర్ పై సుప్రీం కీలక తీర్పు.. తెలంగాణ పిటిషన్ విత్ డ్రా
న్యూఢిల్లీ, 12 జనవరి (హి.స.) పోలవరం - నల్లమల సాగర్ ఇష్యూపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. లింక్ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. విచారణకు అభ్యంతరం తెలిపింద
సుప్రీం కోర్ట్


న్యూఢిల్లీ, 12 జనవరి (హి.స.)

పోలవరం - నల్లమల సాగర్ ఇష్యూపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. లింక్ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. విచారణకు అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల మధ్య ఉండే జల వివాదాలను ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ద్వారానే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను ఉప సంహరించుకుంది. దీనిపై సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలిపింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande