
శబరిమల, 12 జనవరి (హి.స.)
శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా జరిగే మకరజ్యోతి దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ అికారులు ప్రకటన ద్వార తెలిపారు.
జనవరి 14, బుధవారం సాయంత్రం సుమారు 6:45 గంటలకు పంపల మేడపై మకరజ్యోతి దర్శనం భక్తులకు కనువిందు చేయనుంది. ఈ పవిత్ర ఘట్టాన్ని చూసేందుకు సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు శబరిమలకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వర్చువల్ క్యూ ద్వారా 4 లక్షల మందికి పైగా భక్తులు దర్శనానికి నమోదు చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపల మేడ వద్ద సురక్షిత దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భద్రత దృష్ట్యా కేరళ పోలీసులు దాదాపు 30 వేల మంది సిబ్బందిని, అలాగే CRPF, హోమ్ గార్డ్స్, ఫైర్ సర్వీసెస్, మెడికల్ టీమ్స్‌ను మోహరించారు. పంపా నుంచి సన్నిధానం వరకు సుమారు 50 కిలోమీటర్ల మార్గంలో వన్‌వే ట్రాఫిక్, ప్రత్యేక పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. 10 మెడికల్ బూత్స్, 5 ఆసుపత్రులు, అంబులెన్సులు, ఆక్సిజన్ సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. ఇరుముడి భక్తులకు అన్నదానం, మధురం, పానకం వంటి ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV