అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ
అహ్మదాబాద్‌, 12 జనవరి (హి.స.) ప్రధాని నరేంద్రమోదీ సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు (International Kite Festival). జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ.. అహ్మదాబ
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ


అహ్మదాబాద్‌, 12 జనవరి (హి.స.) ప్రధాని నరేంద్రమోదీ సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు (International Kite Festival). జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ.. అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరంలో జరుగుతోన్న ఈ ఫెస్టివల్‌లో ఛాన్స్‌లర్‌తో కలిసి కైట్ ఎగురవేశారు.

ఈ ఉత్సవంలో 50 దేశాలకు చెందిన ఔత్సాహికులు పాల్గొన్నారని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో హనుమాన్ పతంగి ఆకర్షణగా నిలిచింది. గత ఏడాది ఈ ఫెస్టివల్‌కు 3.83 లక్షల మంది సందర్శకులు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య 5 లక్షలకు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక్కడికి వచ్చేవారు ధోలవీర, ఐక్యతా విగ్రహాన్ని కూడా సందర్శిస్తున్నారని, దీనివల్ల రాష్ట్ర పర్యాటకానికి ఊతం లభిస్తోందని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande