పీఎస్‌ఎల్‌వి-సి62 ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సంచలన ప్రకటన
శ్రీహరికోట, 12 జనవరి (హి.స.) ఆంద్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి62 (PSLV-C62) ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ (ISRO Chairman Dr. V. Narayanan) ప్రకటించారు. ప్రయోగ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమా
/isro-chairmans-sensational-statement-on-pslv-c


శ్రీహరికోట, 12 జనవరి (హి.స.)

ఆంద్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి62 (PSLV-C62) ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ (ISRO Chairman Dr. V. Narayanan) ప్రకటించారు.

ప్రయోగ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాకెట్ ప్రయాణం మూడవ దశ వరకు సవ్యంగానే సాగిందని, అయితే మూడవ దశ చివరలో వాహక నౌకలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని తెలిపారు. దీనివల్ల రాకెట్ తన నిర్దేశిత మార్గం నుండి పక్కకు మళ్లిందని, ఫలితంగా ఈ మిషన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

పిఎస్‌ఎల్‌వి (PSLV) నాలుగు దశల వాహక నౌక అని, ఇందులో మొదటి, మూడవ దశలు ఘన ఇంధనం తో, రెండు, నాలుగో దశలు ద్రవ ఇంధనంతో పనిచేస్తాయని డాక్టర్ నారాయణన్ వివరించారు. మూడవ దశ (third step) పూర్తయ్యే సమయానికి సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ప్రస్తుతం అన్ని గ్రౌండ్ స్టేషన్ల నుండి డేటాను సేకరిస్తున్నామని, విశ్లేషణ పూర్తయిన తర్వాత వైఫల్యానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ స్పష్టం చేశారు. ఈ మిషన్ ద్వారా ప్రధాన ఉపగ్రహంతో పాటు దాదాపు 15 నుంచి 18 ఇతర చిన్న ఉపగ్రహాలను (Co-passenger satellites) కూడా ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇందులో స్పానిష్ స్టార్టప్‌కు చెందిన ‘కిడ్’ (Kestrel Initial Demonstrator - KID) అనే రీ-ఎంట్రీ క్యాప్సూల్ కూడా ఉంది.

ఈ రాకెట్ చివరి దశలో ప్రయోగాత్మకంగా భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించాల్సి ఉంది. అలాగే అంతరిక్షంలో ఇంధనం నింపే (Refuelling) సాంకేతికతను పరీక్షించడానికి బెంగళూరు స్టార్టప్ రూపొందించిన ‘ఆయుల్‌శాట్ (AayulSAT)’ ఇతర దేశీయ, అంతర్జాతీయ ఉపగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) వాణిజ్యపరంగా చేపట్టిన ఈ ప్రయోగం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ చివరి దశలో ఈ ప్రయోగం విఫలం అవ్వడంతో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ విచారం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande