వరుసగా ఆరో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
హైదరాబాద్, 12 జనవరి (హి.స.) గత వారంలో వరుసగా ఐదు రోజులు నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు ఈ సోమవారం అయిన కోలుకుంటాయని ఇన్వెస్టర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్లు న
స్టాక్ మార్కెట్


హైదరాబాద్, 12 జనవరి (హి.స.)

గత వారంలో వరుసగా ఐదు రోజులు

నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు ఈ సోమవారం అయిన కోలుకుంటాయని ఇన్వెస్టర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. సోమవారం ఉదయం నుండే నష్టాలతో ప్రారంభమైన సూచీలు, మిడ్-సెషన్ సమయానికి మరింత దిగజారాయి. సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల వరకు నష్టపోయి 82,800 స్థాయికి పడిపోగా, నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయి 25,500 దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. రిలయన్స్, హెచ్ఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ షేర్లు నష్టపోగా, టాటా స్టీల్, ఎన్టిపిసి వంటి కొన్ని షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande