ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
ఢిల్లీ, 12 జనవరి (హి.స.) కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సోమవారం తెల్లవారు జామున ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతిలో ఇన్ఫెక్షన్, వెన్నుముక తదితర సమస్యలతో గత వారం జనవరి 5న సోనియా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్క
సోనియా గాంధీ


ఢిల్లీ, 12 జనవరి (హి.స.)

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సోమవారం తెల్లవారు జామున ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఛాతిలో ఇన్ఫెక్షన్, వెన్నుముక తదితర సమస్యలతో గత వారం జనవరి 5న సోనియా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ వైద్యులు మందులు, ఫిజియోథెరపీ చికిత్స అందించగా.. సోనియా పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

సోనియా గాంధీ పూర్తిగా కోలుకొని, ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande