ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్ లాభాల్లో కొనసాగుతున్న సూచీలు
ముంబై,12 జనవరి (హి.స.)గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కారణంగా తీవ్ర నష్టాలు చవిచూసింది. గత వారం లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న
ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్ లాభాల్లో కొనసాగుతున్న సూచీలు


ముంబై,12 జనవరి (హి.స.)గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కారణంగా తీవ్ర నష్టాలు చవిచూసింది. గత వారం లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ వారం ప్రారంభంలోనూ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా అలానే ఉంటుందని భావించారు. కానీ అనూహ్యంగా ట్రంప్ సన్నిహితుడు, భారత్‌లో అమెరికా రాయబారిగా నియమింపబడిన సెర్గియో గోర్ వ్యాఖ్యల తర్వాత మార్కెట్‌కు మంచి ఊపు వచ్చింది.

ట్రంప్-మోడీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. ట్రంప్ భారత్ పర్యటనకు వస్తారని.. అది ఒకటి, రెండు సంవత్సరాల్లో జరగొచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా జరుగుతుందని శుభవార్త చెప్పారు. ఈ వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్‌కు మంచి జోష్‌నిచ్చింది. నష్టాల్లో ఉన్న సూచీలు.. ఒక్కసారిగా గ్రీన్‌‌లోకి వచ్చేశాయి.

ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెర్గియో గోర్ వ్యాఖ్యలతో అత్యంత వేగంగా సూచీలు పుంజుకున్నాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande