
హైదరాబాద్, 13 జనవరి (హి.స.)
నాకు శత్రువులు లేరు... ప్రజల సంక్షేమమే నా ఎజెండా అని ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బొల్లారంలో RUB విస్తరణ పనులకు ఎంపీ ఈటల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎంపీ వరకు అందరూ ప్రజల ఓట్లతోనే గెలుస్తారని తెలిపారు. అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు ప్రజలకు అందుతాయన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల నిలయం అని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..