మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : బీజేపీ రామచందర్ రావు
హైదరాబాద్, 13 జనవరి (హి.స.) తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్
బీజేపీ రామచందర్


హైదరాబాద్, 13 జనవరి (హి.స.)

తెలంగాణలో త్వరలో జరగనున్న

మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు.

నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని, అందుకే విమర్శలు చేస్తున్నాయని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మంచి ఫలితాలను అందుకున్నారని, అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీపై విలేకరులు ప్రశ్నించగా.. ఆమె పార్టీ పెడతారో లేదో తనకు తెలియదని బదులిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande