ఉత్తరభారతాన్ని వణికిస్తున్న చలిపులి.. ఢిల్లీ గజగజ
న్యూఢిల్లీ, 13 జనవరి (హి.స.) ఉత్తరభారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ లో ఈ సీజన్లోనే అత్
చలి పులి


న్యూఢిల్లీ, 13 జనవరి (హి.స.) ఉత్తరభారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ లో ఈ సీజన్లోనే అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి.మంగళవారం ఉదయం రాజధానిలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఇదే అతి కనిష్ట ఉష్ణోగ్రత కూడా. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande