పురుషాదిక్య భావజాలంతో దుశ్చర్యలు సరికాదు: జస్టిస్ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, 13 జనవరి (హి.స.) మహిళా ఐఏఎస్ అధికారుల పట్ల అసభ్యకరంగా కథనాలు రాయడం గర్హనీయం అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే వార్తల ప్రసారాన్ని ఆయన ఖండించారు. భావ ప్రకటన స్వేచ్చ సమాజానికి ప్రాణవాయువు లాంటిదని, రాజ్
జస్టిస్ సుదర్శన్ రెడ్డి


హైదరాబాద్, 13 జనవరి (హి.స.)

మహిళా ఐఏఎస్ అధికారుల పట్ల అసభ్యకరంగా కథనాలు రాయడం గర్హనీయం అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే వార్తల ప్రసారాన్ని ఆయన ఖండించారు. భావ ప్రకటన స్వేచ్చ సమాజానికి ప్రాణవాయువు లాంటిదని, రాజ్యాంగం పరిమితుల్లేని స్వేచ్ఛకు హామీ ఇవ్వలేదన్నారు. బాధ్యత లేకుండా భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించరాదని చెప్పారు. దుర్వినియోగం చేస్తే నియంత్రణ అదే స్థాయిలో ఉంటుందని, భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో స్వీయ నియంత్రణ అవసరం అన్నారు. సమర్థంగా పని చేసే యువ అధికారిణుల పట్ల అమర్యాద తగదని హెచ్చరించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిత్వం దెబ్బతీయకూడదని, పురుషాధిక్య భావజాలంతో దుశ్చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande