
హైదరాబాద్, 13 జనవరి (హి.స.)
తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు ఇటీవల మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వదంతులపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన నేడు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అవినీతి, అక్రమాలను తెలంగాణ ప్రజలు ఏమాత్రం ఆదరించబోరని అన్నారు. ఇక బీజేపీ నేతలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని, దేవుళ్ల పేరుతో రాజకీయంతోనే ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారని మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..