
మేడారం, 13 జనవరి (హి.స.)
ప్రపంచంలోనే అతిపెద్ద జాతర మేడారం అని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మరోసారి వారు మేడారం జాతర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. ఈసారి జాతరకు రెండు కోట్లకు పైగానే భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమ్మక్క-సారలమ్మతో భావోద్వేగ బంధం ఉందని చెప్పారు. రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. ఈనెల 18వ తేదీన మేడారం జాతరకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారని వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు