
ఖమ్మం, 13 జనవరి (హి.స.)
రైతులు పచ్చని పైరులతో పరిఢ విల్లాలనేది తన ఆకాంక్ష అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మoడలంలో మంచుకొండ ఎత్తిపోతలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే మూడేళ్లలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లా రైతుల పాదాలను గోదావరి జలాలలో కడగడమే తన జీవిత లక్ష్యం అని చెప్పారు. గతేడాది జనవరి 13న బోగి పండగ రోజు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పామని చెప్పిన మాట ప్రకారం పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు