కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన నల్గొండ కలెక్టర్
నల్గొండ జిల్లా, 13 జనవరి (హి.స.) కస్తూర్బాలో కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలి అని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. భీంగల్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. అందుబాటులో ఉన్న సదు
నల్గొండ కలెక్టర్


నల్గొండ జిల్లా, 13 జనవరి (హి.స.)

కస్తూర్బాలో కుక్కలు సంచరించకుండా

చర్యలు తీసుకోవాలి అని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. భీంగల్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించి, ఏమైనా సౌకర్యాలు అవసరం ఉన్నాయా అని నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికలకు ఏకరూప దుస్తులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఇతర మెటీరియల్ పంపిణీ జరిగిందా అని వాకబు చేశారు. పెండింగ్ లో ఉన్న సివిల్ వర్క్స్ వేగవంతంగా చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రహరీ గోడ తక్కువ ఎత్తులో ఉండడాన్ని గమనించిన కలెక్టర్, బాలికల భద్రత కోసం వెంటనే ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande