
నారాయణపేట, 13 జనవరి (హి.స.)
దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లి తిరిగి విధుల్లో
చేరిన నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం మక్తల్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వాకిటి శ్రీహరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను మంత్రి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, రాబోయే వేసవి కాలంలో తాగునీటి సమస్య నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఓటర్ లిస్టు సిద్ధం, పోలింగ్ బూతులు, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు