
నిర్మల్, 13 జనవరి (హి.స.)
సదర్మాట్ మినీ బ్యారేజ్ పనులను
వెంటనే పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మండలంలోని పొన్కల్ గ్రామంలో నిర్మించిన సదర్మాట్ మినీ బ్యారేజ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 16న బ్యారేజ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. హెలికాప్టర్ ల్యాండింగ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..