
హైదరాబాద్, 13 జనవరి (హి.స.)
చైనా మాంజా అమ్మొద్దు.. కొనొద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా కొంత మంది పెడచెవిన పెడుతున్నారు. ఈ చైనా మాంజా వల్ల చాలా చోట్ల మనుషుల తలలు, కాళ్లు, చేతులు తెగుతున్నా తమకేమి కాదన్నట్లు మాంజాను గుట్టుగా వినియోగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నిషేదిత చైనా మాంజా విషయంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అడ్వకేట్ రామరావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు మాంజా విషయంలో వచ్చే ఫిబ్రవరి 26లోపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..