బ్యాంక్ అకౌంట్ నుంచే నేరుగా ట్రాఫిక్ చలాన్ కట్.. తీవ్రంగా ఖండించిన బీఆర్టీయూ
హైదరాబాద్, 13 జనవరి (హి.స.) బ్యాంక్ అకౌంట్ నుంచే నేరుగా ట్రాఫిక్ చలానా కట్ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) తీవ్రంగా ఖండించింది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో బ్యాంక్ అకౌంట్ను తప్పనిసరిగా జత చేయాలన్న ర
Brtu


హైదరాబాద్, 13 జనవరి (హి.స.) బ్యాంక్ అకౌంట్ నుంచే నేరుగా ట్రాఫిక్ చలానా కట్ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) తీవ్రంగా ఖండించింది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో బ్యాంక్ అకౌంట్ను తప్పనిసరిగా జత చేయాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలు, వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమైనదని బీఆర్టీయూ విమర్శించింది. ఇది ప్రజల హక్కులను హరించే ప్రమాదకర నిర్ణయమని పేర్కొన్నారు.

ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెట్టు చాటున, పుట్ట చాటున దాగి ఫోటోలు తీసి చలానాలు విధిస్తున్న పరిస్థితి ఉందని ఆయన అన్నారు. అలాంటి సందర్భాల్లో బ్యాంక్ అకౌంట్ను ఆటోమేటిక్గా లింక్ చేయడం అంటే ప్రజల ఖాతాల నుంచి నేరుగా డబ్బు కట్ చేసే నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శించారు ఇది కేవలం ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి తీసుకుంటున్న నిర్ణయమే తప్ప, పాలనలో సంస్కరణలు తీసుకురావాలన్న నిజమైన ఉద్దేశం కనిపించడం లేదని మండిపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande