డిప్యూటీ సీఎం కు.ప్రధాని. లేఖ
అమరావతి, 14 జనవరి (హి.స.)జపనీస్‌ కత్తి సాము కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ప్రత్యేక లేఖ ద్వారా తన సందేశాన్ని సోమవారం సాయంత్రం
డిప్యూటీ సీఎం కు.ప్రధాని. లేఖ


అమరావతి, 14 జనవరి (హి.స.)జపనీస్‌ కత్తి సాము కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ప్రత్యేక లేఖ ద్వారా తన సందేశాన్ని సోమవారం సాయంత్రం పవన్‌కు పంపించారు. ‘జపనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ రంగంలో మీరు సాధించిన విజయాలను తెలుసుకున్నా. ఇటు ప్రజా జీవితంలో, అటు సినిమా కెరీర్‌లో బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో, నిజాయితీతో మార్షల్‌ ఆర్ట్స్‌ అభ్యసించడం ప్రశంసనీయం. మార్షల్‌ ఆర్ట్స్‌లో దశాబ్దాల పాటు అంకిత భావంతో మీరు చేసిన సాధన స్ఫూర్తిదాయకం. మీ విజయం ద్వారా వృత్తిపరమైన బాధ్యతలు కొత్తవిషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కాదన్న బలమైన సందేశాన్ని యువతరానికి ఇచ్చారు.

ఫిట్‌ ఇండియా లాంటి కార్యక్రమాలకు మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. ఫిట్నెస్‌ పట్ల మీకున్న క్రమశిక్షణ ఎంతో మందికి ప్రేరణ ఇస్తుంది. మీరు సాధించిన ఈ విజయానికి మరోసారి అభినందనలు’’ అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హృదయపూర్వక ఽకృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యుత్తరం పంపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande