సంక్రాంతి చక్కెర పొంగలి.. ఇలా చేస్తే నోట్లో కరిగిపోతుంది!
కర్నూలు, 14 జనవరి (హి.స.)సంక్రాంతి పండుగ అంటేనే పంటలు ఇంటికి వచ్చి ధాన్యరాశులతో రైతులు సంతోషంగా ఉన్నప్పుడు జరుపుకునే పండుగ. సంక్రాంతి పంటల పండుగ, ఆనందాల పండుగ. ఈ పండుగకు ప్రధాన ఆకర్షణగా ఉండేది చక్కెర పొంగలి. కొత్త బియ్యం, పెసరపప్పు, బెల్లంతో తయారు
సంక్రాంతి చక్కెర పొంగలి.. ఇలా చేస్తే నోట్లో కరిగిపోతుంది!


కర్నూలు, 14 జనవరి (హి.స.)సంక్రాంతి పండుగ అంటేనే పంటలు ఇంటికి వచ్చి ధాన్యరాశులతో రైతులు సంతోషంగా ఉన్నప్పుడు జరుపుకునే పండుగ. సంక్రాంతి పంటల పండుగ, ఆనందాల పండుగ. ఈ పండుగకు ప్రధాన ఆకర్షణగా ఉండేది చక్కెర పొంగలి. కొత్త బియ్యం, పెసరపప్పు, బెల్లంతో తయారు చేసే ఈ పొంగలి సంక్రాంతి సంబరాలకు మధురమైన ప్రత్యేకతను తీసుకువస్తుంది. సంక్రాంతికి తయారు చేసే సంక్రాంతి స్పెషల్ చక్కెర పొంగలి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం.

ముందుగా పెసరపప్పును స్వల్పంగా వేయించి సువాసన వచ్చే వరకు వేయాలి. తరువాత కడిగిన బియ్యాన్ని కూడా కొద్ది సేపు నెయ్యిలో వేయించుకోవాలి. శుభ్రంగా కడిగి, వేయించిన పెసరపప్పుతో కలిపి నీరు, పాలు వేసి మెత్తగా ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత బెల్లాన్ని కొద్దిగా నీటిలో కరిగించి వడకట్టి కలపాలి. కొద్దిగా చక్కెర కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది.

బెల్లం కలిపిన తర్వాత మెల్లగా కలుపుతూ ఉడికించాలి. కావాలంటే మరింత నెయ్యి కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు. . ఈ సమయంలో చక్కెర పొంగలికి ప్రత్యేకమైన రంగు, రుచి వస్తాయి. మరో పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పొంగలిలో కలపాలి. చివరగా యాలకుల పొడి వేసి బాగా కలిపితే, నోట్లో కరిగే రుచికరమైన చక్కెర పొంగలి సిద్ధమవుతుంది.

----------ం`ం`-----

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande