ఇరాన్ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక!
న్యూఢిల్లీ, 14 జనవరి (హి.స.) ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. వివిధ కారణాలతో ఇరాన్ వెళ్లి.. అక్కడ ఉన్న భారతీయ పౌరులకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం
అత్యవసర హెచ్చరిక!


న్యూఢిల్లీ, 14 జనవరి (హి.స.)

ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల

దృష్ట్యా భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. వివిధ కారణాలతో ఇరాన్ వెళ్లి.. అక్కడ ఉన్న భారతీయ పౌరులకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న విద్యార్థులు, యాత్రికులు పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాల ద్వారా వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఈ ఏడాది జనవరి 5న జారీ చేసిన ముందస్తు హెచ్చరికను కొనసాగిస్తూ, ప్రస్తుత పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది.

ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు (PIOs) అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande