
ఢిల్లీ,14, జనవరి (హి.స.) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం మైసూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీఎం మార్పు అంశం (CM issue) మళ్లీ తెరపైకి వచ్చింది. రాహుల్‌తో భేటీలో సీఎం మార్పు అంశంపై స్పష్టతనివ్వాలని సిద్ధరామయ్య (Siddaramaiah) ఆయనను కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధికార మార్పు విషయంలో రాష్ట్ర ప్రజలు, పార్టీ, నేతలు కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారని.. దీనిపై వారికి స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు సమాచారం.
గత నవంబరు 20తో సిద్ధరామయ్య సర్కారుకు రెండున్నరేళ్ల గడువు ముగిసిన నేపథ్యంలో సిద్ధు, డీకే మద్దతుదారులు అదే పనిగా దిల్లీలో కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతున్నారు. సిద్ధరామయ్య, డీకే అల్పాహార భేటీల పేరుతో మద్దతుదారులతో సమావేశమవడం, తాను సీఎం కావాలనే కోరికను శివకుమార్ పలుమార్లు పరోక్షంగా వ్యక్తపరుస్తుండడంతో కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ