
న్యూఢిల్లీ, 14 జనవరి (హి.స.)
ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో కెనడా గత నాలుగు దశాబ్దాలుగా పూర్తిగా విఫలమైందని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలు, హింసాత్మక వాతావరణం కెనడా గడ్డపై పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా మీడియాతో మాట్లాడిన దినేశ్ పట్నాయక్, ఉగ్రవాదం విషయంలో కెనడా ప్రభుత్వ వైఖరిపై భారత్కు ఉన్న అభ్యంతరాలను స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా భారత్కు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద గుంపులు కెనడాలో స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, వాటిని అరికట్టడంలో అక్కడి అధికారులు సమర్థవంతంగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు