
హైదరాబాద్, 16 జనవరి (హి.స.)
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు'బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైనప్పటి నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతూ.. భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే రూ. 84 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడో రోజే రూ. 150 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఈ మెగా మూవీ ఇప్పుడు రూ.200 కోట్లకు చేరువలో ఉంది. 4 రోజుల్లో మొత్తం రూ.190 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ.. మెగాస్టార్ మాస్ పోస్టర్ను షేర్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు