
ఢిల్లీ,17, జనవరి (హి.స.) దేశంలోని ఉన్నత విద్యాసంస్థల క్యాంప్‌సలు దారుణంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల మానసిక పరిస్థితులను..ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని పేర్కొంది. విద్యార్థుల ఆత్మహత్యలు, అసహజ మరణాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సమయానుగుణంగా పోలీసులకు వెల్లడించడం లేదని.. ఇకపై అలా జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించిన సమాచాన్ని పోలీసులకు తక్షణమే నివేదించాలని ఉన్నత విద్యాసంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ