ప్రముఖ సింగర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ డెత్ వార్నింగ్
ముంబై:/ ఢిల్లీ,17, జనవరి (హి.స.) ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌, పంజాబీ గాయకుడు బి ప్రాక్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు అందాయి. వారంల్లోగా రూ. 10 కోట్లు ఇవ్వకపోతే దారుణమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ గ్యాంగ్ హెచ్చరించింది. బి
ప్రముఖ సింగర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ డెత్ వార్నింగ్


ముంబై:/ ఢిల్లీ,17, జనవరి (హి.స.) ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌, పంజాబీ గాయకుడు బి ప్రాక్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు అందాయి. వారంల్లోగా రూ. 10 కోట్లు ఇవ్వకపోతే దారుణమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ గ్యాంగ్ హెచ్చరించింది. బి ప్రాక్ సహోద్యోగి, గాయని దిల్నూర్ మొబైల్‌కు ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌ల ద్వారా ఈ బెదిరింపులు అందాయి. ఇది బాలీవుడ్ వర్గాల్లో భయాందోళనలు రేకెత్తించింది.

వివరాల్లోకి వెళితే జనవరి 5న దిల్నూర్ మొబైల్‌కు అంతర్జాతీయ నంబర్ నుంచి రెండు సార్లు ఫోన్ కాల్స్ రాగా ఆమె స్పందించలేదు. మర్నాడు మధ్యాహ్నం మళ్లీ కాల్ రావడంతో అనుమానం రావడంతో ఆమె కట్ చేశారు. ఆ వెంటనే జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అర్జు బిష్ణోయ్ పేరుతో ఆమెకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ‘హలో.. నేను అర్జు బిష్ణోయ్‌ని మాట్లాడుతున్నా.. బి ప్రాక్‌కు చెప్పు.. మాకు రూ. 10 కోట్లు కావాలి. మీకు వారం రోజులు గడువు ఇస్తున్నాం. మీరు ఏ దేశానికి పారిపోయినా సరే, అతనితోపాటు ఉండే ఎవరినికూడా వదిలిపెట్టం. దీన్ని ఫేక్ అని భావించవద్దు. డబ్బు ఇవ్వకపోతే అతన్ని మట్టిలో కలిపేస్తాం’ అని ఆ ఆడియోలో స్పష్టంగా హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande