కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది.
ఢిల్లీ,17, జనవరి (హి.స.)ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత దారుణమైన పనితీరును కనబరిచింది. మొత్తం 227 సీట్లకు గాను కేవలం 22 సీట్లకే పరిమితమయ్యింది. దీం
కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది.


ఢిల్లీ,17, జనవరి (హి.స.)ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత దారుణమైన పనితీరును కనబరిచింది. మొత్తం 227 సీట్లకు గాను కేవలం 22 సీట్లకే పరిమితమయ్యింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.

బీఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి భారీ ర్యాలీలు, రోడ్‌షోలు గానీ, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు గానీ నిర్వహించలేదు. కనీస ప్రణాళిక, సరైన వ్యూహం లేకుండానే బరిలోకి దిగినట్లు స్పష్టంగా కనిపించింది. 1885లో ఇదే నగరంలో పుట్టి, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ, నేడు తన ఉనికిని కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ ఈ పరాజయానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె నాయకత్వ సామర్థ్యంపై పలు ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

అంతకంతకూ దిగజారుతూ..

గత మూడు పర్యాయాల బీఎంసీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, ముంబైలో పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. 2007లో 71 సీట్లు గెలుచుకున్న పార్టీ, 2012 నాటికి 51కి, 2017లో 31కి పడిపోయింది. ఒకప్పుడు 26 శాతానికి పైగా ఉన్న ఓటు బ్యాంకు, నేడు సింగిల్ డిజిట్‌కు పడిపోయే ప్రమాదం ఉంది. ఉత్తరాది ఓటర్లు, దక్షిణాది వారు, గుజరాత్, జైన్, మార్వాడీ వర్గాల మద్దతును తిరిగి పొందడంలో పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ సీనియర్ నేతలే అంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande