
, విజయవాడ) 17 జనవరి (హి.స.)
:సంక్రాంతి(పండక్కి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారికోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. పండుగ ముందు హైదరాబాద్‌కు పెద్దగా బస్సులు నడపని ఆర్టీసీ అధికారులు తిరుగు ప్రయాణాల సందర్భంగా మాత్రం హైదరాబాద్ రూట్‌పై దృష్టి పెట్టారు. పండుగకు ముందు కేవలం 35 స్పెషల్స్ హైదరాబాద్‌కు నడవగా, పండుగ తర్వాత రోజుకు 85కు తగ్గకుండా నడపాలని నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ