పేదల ఇల్లు.. ప్రభుత్వ బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, 18 జనవరి (హి.స.) పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం హుస్నాబాద్
మంత్రి పొన్నం


హుస్నాబాద్, 18 జనవరి (హి.స.)

పేదల సొంతింటి కల నెరవేర్చడమే

ప్రభుత్వ లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 372 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి.. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇల్లు కట్టుకునే వారికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande